- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసుల ఎదుటే ప్రియురాలిపై దాడి
దిశ ప్రతినిధి ,హైదరాబాద్: తనను ఎందుకు మోసం చేశావని ప్రశ్నించిన ప్రియురాలిపై ప్రియుడు దాడి చేశాడు. ఈ సంఘటన గురువారం హెచ్ఆర్సీ ఆవరణలో పోలీసుల ఎదుట జరిగింది. బాధిత యువతి వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెల్లటూర్ గ్రామానికి చెందిన కామిరెడ్డి కవిత 2017లో నగరానికి వచ్చి ఏఎస్ రావు నగర్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో పనిచేసే కృష్ణా జిల్లా వచ్చివాయి గ్రామానికి చెందిన అశోక్ కుమార్తో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఇరువురు కొన్ని నెలల పాటు సహజీవనం చేశారు. ఈ క్రమంలో సదరు యువతి గర్భం దాల్చింది. విషయం తెలిసిన యువకుడు ఆమెకు అబార్షన్ చేయించాడు.
అనంతరం కవిత, అశోక్ కుమార్ మధ్య విభేదాలు ఏర్పడి, కవితను దూరం పెడుతూ వచ్చాడు. దీంతో ఆమె కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో వారి మధ్య మరింత దూరం పెరిగి, కోర్టులో కేసు వరకూ వెళ్లింది. కోర్టులో వాదనలు నడుస్తుండగానే కవిత గత నవంబర్ 3వ తేదీన హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 31వ తేదీకి వాయిదా వేయడంతో వారు హెచ్ఆర్సీ ఎదుట హాజరయ్యారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన అశోక్ కుమార్ను చూసిన బాధితురాలు ఆగ్రహంతో తనను మోసం చేశావంటూ చొక్కా పట్టుకుని నిలదీసింది. ఈ సందర్భంగా అశోక్ కుమార్ ఆమెపై పోలీసులు ఎదుటే పలుమార్లు దాడి చేయడంతో ఆమె చేతికి గాయమైంది. దీంతో హెచ్ఆర్సీ పోలీసులు అబిడ్స్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.