నో చాన్స్.. మమతపై దాడి అంతా బూటకం : ఈసీ

by Shamantha N |   ( Updated:2021-03-13 08:42:46.0  )
నో చాన్స్.. మమతపై దాడి అంతా బూటకం : ఈసీ
X

దిశ, వెబ్‌డెస్క్ : పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అక్కడి రాజకీయాల్లో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటివరకు తృణమూల్ ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామాలు చేసి కషాయ కండువా కప్పుకోగా, తాజాగా బీజేపీకి చెందిన సీనియర్ లీడర్ టీఎంసీలో చేరారు. ఈ క్రమంలోనే ప్రజల విశ్వసనీయతను కొల్లగొట్టేందుకు అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కొత్త ప్రణాళికలు రచిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా నందిగ్రామ్‌ ప్రాంతంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నలుగురు దుండగులు దాడి చేశారని.. దీంతో ఆమె కాలు ఫ్యాక్చర్ అయిందని ప్రచారం జరిగింది. అనంతరం బెంగాల్ సీఎం ఆస్పత్రిలో చేరి కాలుకు చికిత్స పొందుతున్న ఫొటోలు మీడియా, సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఈ ఘటనపై విచారణ జరపాలని కేంద్రం ఎన్నికల సంఘం సంబంధిత అధికారులను ఆదేశించగా.. ప్రచారం సమయంలో సీఎం మమతా బెనర్జీ చుట్టూ భారీ భద్రత ఉందని, ఎలాంటి దాడి జరగలేదని ఈసీ పరిశీలకులు శనివారం నివేదిక ఇచ్చారు.

ఆమెపై దాడి జరిగినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, మమతపై దాడి జరిగే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇదిలాఉండగా, తనపై ప్రతిపక్షాలకు చెందిన వ్యక్తులు దాడి చేశారని నమ్మించి ప్రజల్లో సింపతి కొల్లగొట్టేందుకు దీదీ ప్లాన్ చేసిందని ప్రతిపక్ష, విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ ప్లాన్ ప్రకారమే మమత ఈ మేరకు పొలిటికల్ స్టంట్స్ చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Next Story