విశాఖ స్టేట్ కొవిడ్ హాస్పిటల్‌లో దారుణం

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా విలాయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. . గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 8,555 మందికి కరోనా సోకిన విషయం ఓవైపు కలవర పెడుతుంటే.. ఇదే సమయంలో విశాఖ స్టేట్ కొవిడ్ హాస్పిటల్‌లో జరిగిన ఓ దారుణం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

విశాఖ స్టేట్ కొవిడ్ ఆసుపత్రిలో దయనీయ పరిస్థితులు వెలుగు చూస్తున్నాయి. విమ్స్ హాస్పిటల్‌లో కరోనా పేషంట్ల పరిస్థితి దారుణంగా తయారైంది. క్రమంగా మృతుల సంఖ్య పెరుగుతుండడంతో బాధితుల్లో ఆందోళన ఎక్కువవుతోంది. నేలపై ఓ మహిళ పడి ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. బాధితురాలు కాపాడండి అంటూ అరుస్తున్న ఏ ఒక్క సిబ్బంది కూడా స్పందించకపోవడం గమనార్హం. అయితే, హాస్పిటల్‌లో నేలపైనే పేషంట్లు అవస్థలు పడుతున్నారని ఓ యువకుడు వీడియో తీసి షేర్ చేశాడు. ఇది కాస్తా వైరల్‌గా మారింది. ఆస్పత్రిలో కూడా కరోనా పేషంట్లను పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement