- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబ్బు కోసం గడ్డితినే మనిషిని కాదు: అచ్చెన్నాయుడు
ఈఎస్ఐ స్కామ్‌తో తనకు సంబంధం లేదని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 900 కోట్ల ఈఎస్ఐ స్కామ్‌లో తన పాత్ర ఉందన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. ఒక టీవీ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ, టెలీ మెడిసిన్‌ను అమలు చేస్తామంటే మంత్రిగా ఆమోదించానని అన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అవినీతితో తనకు సంబంధం అంటగడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఆ నోట్ ఇచ్చినప్పుడు కూడా తాను ఈ విధానం ఎక్కడైనా అమలులో ఉందా? అని అధికారులను ప్రశ్నించానని ఆయన అన్నారు. తెలంగాణలో అమలులో ఉందని అధికారులు చెబితేనే తాను విధివిధానాలన్నీ అక్కడ అమలవుతున్నట్టే చేయాలని ఆదేశాలు జారీ చేశానని ఆయన చెప్పారు. డబ్బు కోసం గడ్డితినే అవసరం తనకు కానీ తన కుటుంబానికి కానీ లేదని ఆయన స్పష్టం చేశారు. మంత్రిగా ఆదేశాలివ్వాల్సిన బాధ్యత తనపై ఉంటుందన్న అచ్చెన్నాయుడు, అధికారుల అవినీకి తనను బాధ్యుడ్ని చేయడం సమంజసం కాదని ఆయన చెప్పారు.