- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన అచ్చెన్నాయుడు

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు సోమవారం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించగా… మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఏసీబీ ప్రత్యేక కోర్టు అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్‌ను రద్దు చేసి సంగతి తెలిసిందే. ఈఎస్ఐ స్కామ్ కేసులో అచ్చెన్నాయుడును ఏపీ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
మరోవైపు… తనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలన్న అచ్చెన్నాయుడి పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అచ్చెన్న హెల్త్ ఆందోళనకరంగా ఉందని, వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. శస్త్రచికిత్స తర్వాత అచ్చెన్నాయుడి ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రభుత్వ తరపు లాయర్ చెప్పారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తూ ఎల్లుండికి వాయిదా వేసింది.