ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రిలో దారుణం.. మరో రోగి మృతి

by Anukaran |   ( Updated:2020-06-29 08:20:12.0  )
ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రిలో దారుణం.. మరో రోగి మృతి
X

దిశ, హైదరాబాద్: ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రిలో ఆదివారం ఓ వ్యక్తి తనకు ఊపిరి ఆడటంలేదని, 3 గంటలుగా బతిమిలాడినా సిబ్బంది వెంటిలేటర్‌ పెట్టడంలేదని, గుండె ఆగిపోతోందని, ఊపిరి ఒక్కటే కొట్టుకుంటుందంటూ తల్లడిల్లుతూ తన తండ్రికి సెల్ఫీ వీడియో పంపి అనంతరం మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి 24 గంటలు కూడా కాకముందే అదే ఆసుపత్రిలో మరో ఘటన సంచలనం రేపుతోంది. కరోనా రోగుల పట్ల వైద్యులు పదేపదే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు, ప్రతిపక్షాల నుంచి ఎంత ఒత్తిడి వచ్చిన వైద్యులు మారడం లేదు. కరోనా రోగుల పట్ల వివక్ష చూపుతున్నారు. కాగా తాజాగా సోమవారం ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రి వైద్యులు మరో అభాగ్యుడిని పొట్టన పెట్టుకున్నారు. తనకు చికిత్స చేయడం లేదని సెల్ఫీ వీడియో తీసి సయ్యద్‌ అనే రోగి చనిపోయాడు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నానని వీడియోలో సయ్యద్‌ వాపోయాడు. దీంతో ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం సోమవారం మరో రోగి మృతికి కారణమయ్యారు. వైద్యుల తీరుపై పలు విమర్శలు వస్తున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులకు లక్షల రూపాయలు పెట్టలేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ప్రాణాలు పోతున్నామని సమాన్యులు మండిపడుతున్నారు. ‘‘మా ప్రాణాలకు కాపాడే వారే లేరా’’ అంటూ వాపోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed