ఆస్ట్రాజెనెకా టీకా వాడకం నిలిపివేత..

by Shamantha N |
ఆస్ట్రాజెనెకా టీకా వాడకం నిలిపివేత..
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా నివారణకు వినియోగించే ఆస్ట్రాజెనెకా టీకా వాడకాన్ని డెన్మార్క్, నార్వే దేశాలు నిలిపివేశాయి. ఈ టీకా తీసుకున్న కరోనా రోగుల్లో రక్తం గడ్డ కడుతున్నట్లు ఆందోళన వ్యక్తమైంది. దీనిని పరిశీలించిన అనంతరం అక్కడి వైద్యుల సూచన మేరకు ఆయా దేశాల ప్రభుత్వాలు అత్యవసరంగా ఆస్ట్రాజెనెకా వినియోగాన్ని నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాయి.

కాగా, దేశీయంగా సీరమ్, ఆస్ట్రాజెనెకా కంపెనీలు సంయుక్తంగా కరోనా టీకాను తయారు చేసిన విషయం తెలిసిందే. సీరమ్ కంపెనీ సీఈవో అదర్ పూనావాలా ఈ టీకాను ఇండియాలో కోవిషీల్డ్ పేరిట తీసుకొచ్చారు. ఇండియాలో భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్‌తో పాటు కోవిషీల్డ్‌ టీకాను కేంద్ర ప్రభుత్వం కరోనా నివారణలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రజలకు పంపిణీ చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed