వికటించిన వ్యాక్సిన్..

by vinod kumar |   ( Updated:2020-09-08 23:55:05.0  )
వికటించిన వ్యాక్సిన్..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి నివారణకు శాస్త్రవేత్తలు రేయింబవళ్లు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే కరోనా టీకా తయారుచేసినట్లు రష్యా ప్రకటించుకోగా, మిగతా దేశాలు తయారుచేస్తున్న టీకాలు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్‌ను బ్రిటన్‌లో ఓ షేషెంట్ పై ప్రయోగించగా అది వికటించింది.

దీంతో ఆ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. మూడో దశ ట్రయల్స్‌లో ఫలితం బెడిసికొట్టిందని తెలుస్తోంది. దాంతో తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్‌తో ఆ రోగి ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడైంది. ఈ మేరకు మూడోదశ ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆక్స్‌ఫర్డ్ ప్రకటించింది. అయితే, ఆక్స్‌ఫర్డ్ , ఆస్ట్రాజెనెకా ఫార్మా కంపెనీలు సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నాయి. వీటిని అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల్లోని కరోనా రోగులపై కూడా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. తాజా ఘటన నేపథ్యంలో ప్రస్తుతం ఆ దేశాల్లోనూ ట్రయల్స్ నిలిపివేసినట్లు ఆక్స్‌ఫర్డ్ ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed