కెనాల్‌లో AE మృతదేహం లభ్యం..

దిశ, కరీంనగర్: కరీంనగర్ సమీపంలోని చింతకుంట SRSP కెనాల్‌లో అసిస్టెంట్ ఇంజినీర్ (AE) బోయిన్ సాగర్ మృతదేహం లభ్యమైంది. సిరిసిల్ల జిల్లా కొనరావుపేటకు చెందిన సాగర్ కరీంనగర్‌లోని భగత్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. మంగళవారం పని ఉందని ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదని కుటుంబసభ్యులు వెల్లడించారు.

ఈ క్రమంలోనే బుధవారం బోయిన్ సాగర్ కెనాల్‌లో శవమై తేలడంపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. బాధితుడు ప్రమాదవశాత్తు కెనాల్‌లో జారిపడిపోయాడా లేక సూసైడ్ చేసుకున్నాడా.. ఇతర కారణాలు ఎమైనా ఉంటాయా అన్న కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Read Also…

‘VRO’ రద్దు.. టెన్షన్‌లో రైతులు?

Advertisement