అక్కడ బార్లు తెరుచుకున్నాయ్!

by Shamantha N |
అక్కడ బార్లు తెరుచుకున్నాయ్!
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సిట్టింగ్ బార్లు మూతపడ్డాయి. తాజాగా కేంద్రం అన్‌లాక్ 3.0 ప్రకటించడంతో కొవిడ్ నిబంధనలకు అనుగుణంలో బార్లు తెరుచుకోనున్నాయి.

తాజాగా అస్సాం రాష్ట్రంలో లైసెన్స్ కలిగియున్న బార్లు తెరిచేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. కరోనా నిబంధనలకు అనుగుణంగానే మద్యం సరఫరా చేయాలని షరతులు విధించింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. అన్‌లాక్ 3.0లో భాగంగా బార్లు తెరిచిన రాష్ట్రంగా అస్సాం నిలవనుంది.

Advertisement

Next Story

Most Viewed