చిత్తూరు OSDగా ఈశ్వర్ రెడ్డి..

దిశ, వెబ్‌డెస్క్ :

ఇటీవల ASPగా పదోన్నతి పొందిన ఈశ్వర్ రెడ్డి తాజాగా చిత్తూరు జిల్లా OSDగా నియమితులయ్యారు. అంతకు ముందు చిత్తూరు DSPగా ఈశ్వర్ రెడ్డి విధులు నిర్వర్తించారు. కరోనా కట్టడితో పాటు శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ, నేరాల నియంత్రణకు ఆయన చేపట్టిన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.

కరోనా కష్టకాలంలో వలస కార్మికులను ఆదుకోవడంలో ఈశ్వర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. జిల్లాకు ఆయన సేవలు మరింత అవసరమని భావించిన ఏపీ సర్కార్ ఈశ్వర్ రెడ్డిని చిత్తూరు జిల్లా ఓఎస్డీగా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో త్వరలోనే ఈశ్వర్ రెడ్డి OSDగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Advertisement