డ్యాన్స్ అదరగొట్టిన ఎమ్మెల్యే.. స్టెప్పులేసిన జనాలు

by Aamani |   ( Updated:2023-10-02 09:56:05.0  )
Asifabad MLA Athram Sakku
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: రాజ్ గోండ్స్(ఆదివాసీ) వివాహ వివాహ వేడుకల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెళ్లి వేడుకల్ డేంస్సా నృత్యం చేసి అందరిలో జోష్ నింపారు. కొమురం భీం జిల్లా సిర్పూర్ మండలం దేవుడుపల్లి గ్రామంలో సోమవారం ఆత్రం ధర్మరావు-మహేశ్వరీ పెళ్లి వేడుక జరిగింది. ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆత్ర౦ సక్కు సాధారణ వ్యక్తిలా అందరితో కలిసి డేంస్సా నృత్యం చేసి ఆకట్టుకున్నారు. తమ ఆచార సాంప్రదాయాలను ఎమ్మెల్యే గౌరవిస్తారని, ఆయన మాతో కలిసి నృత్యం చేయడం పట్ల ఆదివాసీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story