- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏషియన్ పెయింట్స్ తొలి త్రైమాసిక లాభంలో 67 శాతం క్షీణత!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద పెయింట్ తయారీ కంపెనీ ఏషియన్ పెయింట్స్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి తొలి త్రైమాసికంలో ఏకీకృత లాభం 66.7 శాతం క్షీణించి రూ. 218.45 కోట్లకు పడిపోయిందని కంపెనీ వెల్లడించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 42.7 శాతం పెరిగి రూ. 2,922.66 కోట్లకు చేరుకుందని, అంతకుముందు త్రైమాసికంలో ఇది రూ. 5,104.72 కోట్లుగా నమోదైందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇక, తొలి త్రైమాసికంలో పన్నులకు ముందు లాభం 70.2 శాతం తగ్గి రూ. 1,025.24 కోట్ల నుంచి రూ. 305.76 కోట్లకు చేరినట్టు ఏషియన్ పెయింట్ల ప్రకటించింది.
‘లాక్‌డౌన్ పొడిగింపుతో ఏప్రిల్‌లో పూర్తిస్థాయిలో దిగజారిన వ్యాపారం మే, జూన్ నెలల్లో కొంత మెరుగుపడిందని ఏషియన్ పెయింట్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో అమిత్ సింగాల్ తెలిపారు. జూన్ నెలలో తమ కంపెనీ వ్యాపారం రెండంకెల వృద్ధిని నమోదు చేసిందని, మొత్తంగా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తొలి త్రైమాసికంలో ఆశాజనమైన ఫలితాలతో ముగించినట్టు అమిత్ సింగాల్ పేర్కొన్నారు. భారత్‌లో జూన్ నెలలో అమ్మకాలు సానుకూలంగా ఉన్నాయని, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా మార్కెట్లలో అనుకూలమైన నిర్వహణ పరిస్థితుల మద్దతుతో అంతర్జాతీయ బిజినెస్ పోర్ట్‌ఫోలియో బాగుందని కంపెనీ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో తెలిపింది. కరోనా పరిస్థితుల నుంచి నెమ్మదిగా కోలుకుని ముడి పదార్థాల ధరలు, పలు వ్యయ నియంత్రణ చర్యలతో వ్యాపారం లాభదాయకత కలిగి ఉంటుందని నమ్ముతున్నట్టు కంపెనీ పేర్కొంది.