- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
యాషెస్ మెుదటి టెస్ట్ గురించి అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకున్న ఇంగ్లాండ్ జట్టు నాల్గవరోజు మొదటి సెషన్‌లో కూడా మెరుగ్గా రాణిస్తే, ఐదో రోజు జరిగే మ్యాచ్ మాత్రం ఎక్కువ సమయంతో పాటు ఆసక్తికరంగా కూడా జరుగుతుందని భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు.
ఒక తరుణంలో ఇంగ్లాండ్ 61 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. తరువాత వచ్చిన కెప్టెన్ జో రూట్, డేవిడ్ మలన్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దారు. వీరిద్దరు కలిసి 159 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. నాల్గవరోజు కూడా ఇంగ్లాండ్ ఇదే జోరును కొనసాగిస్తే మాత్రం మ్యాచ్ మంచి రసవత్తరంగా మారనుంది.
Next Story