- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూపర్ గ్రిప్పింగ్.. ‘ఆశ్రమ్ 2’
దిశ, వెబ్‌డెస్క్: ‘ఆశ్రమ్ 2’ వచ్చేసింది. ఫస్ట్ సీజన్‌కు మించిన గ్రిప్పింగ్ కథనంతో సాగే ఈ సిరీస్‌లో పగటి పూట దేవుడిలా, చీకటిపడితే మృగంలా మారే కాశీపూర్ బాబా లీలలు బయటపడ్డాయి. భక్తిమత్తులో మునిగి బాబాను దేవుడిలా కొలిచిన వారంతా కళ్లు తెరిచి నిజం తెలుసుకున్నారు. ఇక పాలిటిక్స్ ప్లే చేయడంలో శకునిని మించిన ఎత్తులు వేసే బాబా.. తన ద్వారా జీవితాన్ని నష్టపోయిన వారు కూడా అవే ఎత్తులు వేస్తారని తెలుసుకోలేకపోయాడు. రాజకీయాల్లో తన ఎత్తులతో ప్రత్యర్థులను చిత్తు చేసిన బాబా పతనానికి.. చావు దెబ్బతిన్న సామాన్యుల చేతుల్లోనే అంకురార్పణ జరిగింది. ఆగ్రహంతో రగిలిపోయిన భక్తులు బాబాపై ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఆశ్రమం నుంచి బయటపడగా, బాబా అంతు చూసేందుకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఆశ్రమంలోకి అడుగుపెట్టారు జర్నలిస్ట్, పోలీస్ ఆఫీసర్, డాక్టర్.
కథ:
ఆశ్రమ్ 2 సిరీస్.. ఫస్ట్ సీజన్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే మొదలైంది. కానీ అమ్మాయిలపై బాబా అత్యాచారం, డ్రగ్స్ కోణం, రాజకీయాలపై నిర్మాత, దర్శకులు ప్రకాశ్ ఝా ఈ సీజన్‌లో ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు. సనోబర్, కవిత లాంటి పాత్రలు ఫస్ట్ సీజన్‌లో కనీసం నోరు కూడా విప్పకుండా ఉండగా.. ఈ సీజన్‌లో మాత్రం బాబాపై రివేంజ్‌లో భాగమయ్యారు. బాబా(సన్నీ డియోల్).. శుద్ధీకరణ పేరుతో తనకు, తన భర్తకు అన్యాయం చేశాడని తెలుసుకున్న బబిత( త్రిధా చౌదరి).. తన మీద పగతీర్చుకునే ప్లాన్‌లో ఉంటుందనే ఎక్స్‌పెక్టేషన్స్‌తో సీజన్ 2 చూడటం స్టార్ట్ చేసిన ప్రేక్షకులకు కథలో అనుకోని ట్విస్ట్ ఎదురవుతుంది. రివేంజ్ సంగతి పక్కనబెట్టి తను కూడా బాబాకు లొంగిపోతుంది. ఇక పహిల్వాన్ పమ్మీ కేరెక్టర్ ఈ సీజన్‌కే హైలెట్. తనకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారని తెలుసు కానీ ఎవరు చేశారనే ప్రశ్నార్ధకంలో ఉన్న పమ్మీ.. తనకు సమాజంలో గౌరవాన్ని ప్రసాదించిన బాబానే ఈ పని చేశాడని కవిత సాయంతో ప్రాక్టికల్‌గా తెలుసుకుని తనకు ఎదురు తిరుగుతుంది. ఈ క్రమంలో జైలు జీవితాన్ని కూడా అనుభవిస్తుంది. కానీ బబిత సాయంతో జైలు నుంచి బయటపడిన పమ్మీ.. బాబా దగ్గరకొచ్చి తను తప్పు చేశానని, మీకు ఎదురొడ్డి నిలవలేనని అర్ధమైందని.. మీ ఆశ్రయంలోనే నా భవిష్యత్తు ఉంటుందని నమ్మించి, జర్నలిస్ట్ సహాయంతో పక్కా ప్లాన్‌తో ఆశ్రమం నుంచి బయటపడింది. ఈ క్రమంలో హాస్టల్ వార్డెన్, బాబా చెంచాను మట్టుబెడుతుంది. అలా పమ్మి బయటపడటం.. ఆశ్రమానికి, బాబా పరపతికి అంత క్షేమం కాదని.. తనను రప్పించేందుకు పమ్మి సోదరుడిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తాడు బాబా రైట్ హ్యాండ్ బొప్పా సామి. కానీ పమ్మి మళ్లీ ఆశ్రమానికి రాకూడదని తనను తానే కాల్చుకుని చనిపోతాడు. దీంతో తన ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది.
ఇక మహిళ హత్యకేసులో సాక్ష్యంగా ఉన్న తన సోదరిని, అందుకు సహకరించిన జర్నలిస్ట్ తల్లి అడ్రస్ తెలుసుకుని హత్య చేస్తారు బాబా మనుషులు. దీంతో పగతో రగిలిపోతున్న జర్నలిస్ట్ ఆశ్రమంలోకి ఎలక్ట్రిషియన్‌గా ప్రవేశించడం.. అటు పోలీసులు కూడా మారు వేషంలో ఆశ్రమంలోకి ఎంటర్ అవుతారు. జర్నలిస్ట్, పోలీస్ ఆఫీసర్ కలిసి బాబా చీకటి సామ్రాజ్యానికి చెందిన ఆధారాలు సేకరిస్తారు. కానీ ఈ ఆధారాలు ఉన్నతాధికారికి అందించగా.. అతను పర్సనల్ ఇష్యూస్, ప్రమోషన్ కోసం ఆ ఫైల్‌ను ముఖ్యమంత్రికి అప్పజెబుతాడు. కాగా ఫైల్‌ను అడ్డు పెట్టుకుని బాబా సపోర్ట్‌తో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్లాన్ చేస్తాడు సీఎం. కానీ బాబా సీఎంకు సపోర్ట్ చేస్తున్నట్లే చేసి.. అపోజిషన్‌కు అధికారం దక్కేలా చేస్తాడు.
మొత్తానికి ఇటు పమ్మి.. అటు జర్నలిస్ట్, డాక్టర్, పోలీస్ ఆఫీసర్ గ్రూప్.. మరో వైపు బాబా వల్ల మరోసారి అధికారం దక్కని ముఖ్యమంత్రి.. అందరూ బాబాపై రివేంజ్‌కు సిద్ధం అవుతుండటంతో రెండో సీజన్ ముగుస్తుంది. కాగా థర్డ్ సీజన్‌లో కథకు ముగింపు ఇవ్వనున్నారు డైరెక్టర్ ప్రకాష్ ఝా. అయితే ఇక్కడ రచయితల పనితనం, స్క్రీన్ ప్లే వర్క్ సిరీస్‌పై గ్రిప్ పెంచగా.. ఆర్ట్ డైరెక్టర్స్ సిరీస్ రాయల్టీని పెంచారని ప్రశంసలు అందుకుంటున్నారు.