- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
‘మోడీ రాజస్తాన్‌లో చేస్తున్న తమాషా ఆపండి’
జైపూర్: రాజస్తాన్ సర్కారును కూల్చడానికి బీజేపీ చేస్తున్న కుట్రలకు ప్రధాని మోడీ ఫుల్‌స్టాప్ పెట్టాలని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. తన వర్గీయులతో జైసల్మేర్ చేరిన సీఎం గెహ్లాట్ విలేకరులతో మాట్లాడుతూ, ‘మోడీజీ గారు దేశ ప్రధాని. దేశాన్ని నడిపించడానికి అతనికి ప్రజలు రెండు సార్లు అవకాశమిచ్చారు. చప్పట్లు కొట్టమన్నా, వంటపాత్రలు చరచమన్నా ప్రజలు నమ్మి అవి చేశారు. కానీ, ఇప్పుడు దాన్ని మించి మరోటి వచ్చింది. రాజస్తాన్‌లోని ఆయన తమాషాను ఆపేయాలి. అసెంబ్లీ సెషన్ ముందు వారు ఎమ్మెల్యేల కొనుగోళ్లకు రేట్లను పెంచారు. ఏందీ డ్రామా?’ అని చెప్పారు.
తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్ వర్గాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మన్నిస్తే వారికి పున:స్వాగతం పలుకుతారని అన్నారు. అసెంబ్లీ సమావేశం కోసం గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా, సీఎం అశోక్ గెహ్లాట్‌ల మధ్య మాటలయుద్ధం ముగిసింది. 21 రోజల తర్వాత అసెంబ్లీ సమావేశానికి ఏర్పాటు చేస్తామన్న గవర్నర్ నిర్ణయాన్ని గెహ్లాట్ అంగీకరించిన సంగతి తెలిసిందే.