12వ తరగతి ఎగ్జామ్స్‌లో 94శాతం మార్కులు సాధించిన నటి

by Shyam |   ( Updated:2021-08-02 02:31:52.0  )
12వ తరగతి ఎగ్జామ్స్‌లో 94శాతం మార్కులు సాధించిన నటి
X

దిశ, సినిమా : యాక్ట్రెస్ అన్షూర్ కౌర్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. సీబీఎస్‌ఈ బోర్డ్ ఎగ్జామినేషన్స్‌ 12వ తరగతిలో 94శాతం మార్కులు సాధించి బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకుంటోంది. ఈ విషయంపై స్పందించిన అన్షూర్.. యాక్టర్స్ కూడా ఇంటెలిజెంట్స్ అని ఉదాహరణగా నిలిచినందుకు హ్యాపీగా ఉన్నానని తెలిపింది. అలాగే చాలామంది తనను అప్రిషియేట్ చేస్తూ కాల్స్, మెసేజ్‌లు చేశారని చెబుతూ.. ‘మంచి రిజల్ట్ వస్తుందని ముందే ఎక్స్‌పెక్ట్ చేశా. ఇందుకోసం చాలా కష్టపడ్దాను. వైవా, ప్రాక్టికల్స్‌లో వందశాతం పర్ఫామెన్స్ ఇచ్చాను’ అని వివరించింది. ఇక తన పేరెంట్స్ ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలని అనుకున్నానన్న అన్షూర్.. రిజల్ట్స్‌కు ముందు చాలా నర్వస్‌గా ఉన్నానని, ఆన్‌లైన్‌లో రిజల్ట్ చెక్ చేసేటప్పుడు తనతో పేరెంట్స్ కూడా ఉన్నారని చెప్పింది. కానీ ఫలితాలు చూడగానే ఎగ్జైట్‌మెంట్‌తో అరిచేశామని, అదొక మంచి ఫ్యామిలీ మోమెంట్ అని తెలిపింది అన్షూర్.

Fallow disha cinema facebook page: https://www.facebook.com/Dishacinema



Next Story

Most Viewed