ఆశా వర్కర్లకు ఫిక్స్ డ్ పే చెల్లించాలి

by  |
ఆశా వర్కర్లకు ఫిక్స్ డ్ పే చెల్లించాలి
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్:
ఏపీలో చెల్లిస్తున్నట్టు‌గా తెలంగాణలోనూ ఆశా వర్కర్లకు రూ 10 వేల ఫిక్సెడ్ వేతనాన్ని చెల్లించాలని తెలంగాణ వాలంటరీ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో 2005 నుండి ఆశా వర్కర్లు వైద్యసేవలను అందిస్తున్నప్పటికీ పనిని బట్టి వేతనాలను చెల్లించడాన్ని యూనియన్ నాయకులు వ్యతిరేకించారు. ఏపీలో మాదిరిగా తమకు రూ 10 వేలు వేతనం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తమకు కనీస వేతనాలు చెల్లించాలని 106 రోజులు సమ్మె చేసినట్టు వారు తెలిపారు. దీంతో 2017‌లో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేసి రూ 6 వేలు వేతనాన్ని ఇస్తామని ప్రకటించి కేవలం పారితోషికాలను మాత్రమే పెంచుతూ జీఓ 167 జారీ చేశారని తెలిపారు. పారితోషికాల పద్ధతిని వెంటనే ఉపసంహరించి తమకు ఫిక్సిడ్ పే చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈనెల 28,29,30 తేదీల్లో రాష్ట్రవ్యాప్త సమ్మెకు దిగనున్నట్టు వారు ప్రకటించారు.


Next Story