- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆకట్టుకుంటున్న ‘అసలేం జరిగింది’ ఫస్ట్ సింగిల్
దిశ, వెబ్‌డెస్క్: శ్రీరాం, సంచితా పడుకునే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అసలేం జరిగింది’. ఎక్సోడస్ మీడియా నిర్మించిన ఈ సినిమాకు నూలేటి వీర రాఘవ దర్శకులు. ఈ చిత్రం నుంచి ‘వెన్నెల చిరునవ్వై’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు దర్శకుడు ఎన్.శంకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘వెన్నెల చిరునవ్వై’ పాట మెలోడియస్‌గా ఉందని, చాలా రోజుల తర్వాత నటుడు శ్రీరాం ఈ సినిమాలో చాలా బాగా నటించాడని శంకర్ తెలిపారు. తెలంగాణలో జరిగిన విభిన్నమైన సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాక్షించారు.
యెలేందర్ మహవీర్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో జరిగిన వాస్తవ సంఘటనల్ని స్ఫూర్తిగా తీసుకుని రూపొందించిన ఈ థ్రిల్లర్, సస్పెన్స్ లవ్ స్టోరీ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని నిర్మాత మైనేని నీలిమా చౌదరి చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏలెంద్ర మహావీర్ మనసు పెట్టి మంచి పాటల్ని అందించారని, విజయ్ ప్రకాశ్ పాడిన ‘వెన్నెల చిరునవ్వై’ పాట ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని మరో నిర్మాత కింగ్ జాన్సన్ అన్నారు. ఈ చిత్రం ద్వారా జనగాంకు చెందిన రవికుమార్ ప్రతి నాయకుడిగా పరిచయం అవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు టేక్మాల్ శ్రీకార్ రెడ్డి, సంగ కుమార స్వామి పాల్గొన్నారు. చిరవూరి విజయ్ కుమార్ లిరిక్స్ అందించిన పాట సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.