కేంద్రం పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఓవైసీ

by Anukaran |   ( Updated:2021-12-18 05:43:44.0  )
కేంద్రం పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఓవైసీ
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి వర్గం ఆమెదం తెలిపిన మహిళల వివాహవయస్సు పై దేశ వ్యాప్త చర్చ మొదలైంది. 21 ఏళ్లు పెంచడం పై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రధానిని ఎన్నుకోవడానికి 18 ఏళ్లు సరిపోయినప్పుడు పెళ్లికి ఎందుకు సరిపోదు అంటూ విమర్శలు చేశారు. ప్రభుత్వ ధోరణి పితృస్వామ్యంగా ఉందని ఎద్దేవా చేశారు. మహిళల్లో వివాహ వయసు పెంచడం వల్ల వారి జీవితాల్లో మార్పు రాదని, వారికి ఆర్థిక వెసలు బాటును కల్పించాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి అడ్డు రాని వయసు వివాహానికి ఎందుకు అడ్డు వస్తుందని ప్రశ్నించారు.

బాల్య వివాహాలు నిషేదిస్తూ మన దేశంలో చట్టాలు ఉన్నాయని, కానీ అవి సక్రమంగా అమలుకావడం లేదని అన్నారు. దేశంలో ఇప్పటి వరకు 786 కేసులు నమోదు అయ్యాయని వాటిపై ఇంతవరకూ చర్యలే లేవని, దేశ వ్యాప్తంగా ఇంకా చిన్న పిల్లల పెళ్లిల్లు జరుగుతున్నాయని ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదని విమర్శించారు. గతంతో పోల్చితే బాల్య వివాహాలు తగ్గాయని.. దానికి కారణం చట్టాలు కాదని, బాలికల్లో పెరిగిన విద్య, ఆర్ధికంగా వారి ఎదుగుదలలో వచ్చిన మార్పులే కారణమన్నారు. మెదీకి నిజాయితీ ఉంటే మహిళలకు ఆర్థిక అవకాశాలు కల్పించాలని సవాలు విసిరారు. ప్రపంచంలో బలమైన నారీ శక్తి కలిగిన ఏకైక దేశం భారత దేశం అంటూ కొనియాడారు.

ప్రపంచంలో న్యూజిలాండ్, అమెరికా వంటి దేశాలలో వివాహ వయస్సు కేవలం 14 , 16 సంవత్సరాలేనన్నారు. అక్కడ మహిళలకు చిన్న వయసులోనే సొంత నిర్ణయాలు తీసుకునేంతగా చట్టాలు అవకాశమిచ్చాయన్నారు. చిన్న వయసులోనే పెద్ద నిర్ణయాలు తీసుకునేంత స్థాయికి వారి మానసిక పరిపక్వత పెరిగిందని , దానికి అక్కడి ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలే కారణం అన్నారు.

Advertisement

Next Story