మిమ్మల్ని ఎవరు రక్షిస్తారో చూస్తా.. ఎవ్వరినీ విడిచిపెట్టం..

by Anukaran |   ( Updated:2021-12-24 07:37:37.0  )
Asaduddin Owaisi
X

దిశ, వెబ్ డెస్క్: ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని ఒక మీటింగ్ లో ఆయన పోలీసుల పై దురుసుగా మాట్లాడారు.

‘ ఉత్తర ప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా యోగి ఉన్నారు, ప్రధాని గా మోదీ ఉన్నారు. అయితే వారు ఎల్లకాలం ఉండరు. ఏదో ఒక రోజు మాకు అవకాశం వస్తుంది. ఆరోజు మిమ్మల్ని ఎవరినీ వదిలిపెట్టం. అందర్ని గుర్తుపెట్టుకుంటాం. ముస్లిం లు ఇప్పటి వరకూ చాలా శాంతి గా ఉన్నారు. పదవీ కాలం అయిపోతే యోగి మఠానికి వెళ్లిపోతారు, మోదీ పర్వాతాలకు పోతారు అప్పుడు మిమ్మల్ని ఎవరు రక్షిస్తారో చూస్తాం. అల్లా మిమ్మల్ని కచ్చితంగా శిక్షిస్తాడు. ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటాం.’

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు గల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఆయన ఏ సందర్భంలో ఈ మాటలు అన్నాడో చూడాలని కొందరు నెటిజన్లు అంటున్నా, అసలు పోలీసులను అలా బెదిరించడం ఏంటని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.

https://mobile.twitter.com/Tejasvi_Surya/status/1474101089779675139

Advertisement

Next Story