ఇదేనా మీ సెక్యూలరిజం: ఓవైసీ

by Anukaran |   ( Updated:2021-12-12 10:35:07.0  )
asaduddin-owaisi
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలకు అసదుద్దిన్ ఓవైసీ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ట్విట్టర్ వేదికగా ఇదేనా కాంగ్రెస్ సెక్యూలరిజం అంటూ విమర్శలు ఎక్కుపెట్టాడు. ఈ దేశం ఏ ఒక్క మతానికి చెందింది కాదని, ఇది అందరిదని ఘూటు వ్యాఖ్యలు చేశాడు.

రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కలిసి దేశంలో కొత్త విధానానికి నాంది పలుకుతారా ? అంటూ ఫైర్ అయ్యారు. హిందుత్వం అనే నినాదాన్ని మీరు మరింత పెంచి పోషిస్తున్నట్టుంది అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు ఇప్పుడు హిందుత్వం పులుముకున్న పార్టీలకు మరింత ఊతం ఇచ్చేలా కనిపిస్తున్నాయని విమర్శి్ంచారు.

Advertisement

Next Story