- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలోనే యంగెస్ట్ మేయర్‌గా ఆర్య రాజేంద్రన్ రికార్డ్
దిశ,వెబ్‌డెస్క్: ఆర్య రాజేంద్రన్..కేరళలో ఇప్పుడు ఎక్కడ విన్నా ఆమె పేరే. 21 ఏళ్లకే కీలకమైన తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని చేపట్టింది బీఎస్సీ విద్యార్థిని. ఈ ఎన్నికల్లో గెలిచిన అతి పిన్న వయస్కురాలుగా ఆమె రికార్డు సృష్టించారు. విపక్షాల నుంచి బలమైన అభ్యర్థిని బరిలో నిలిచినా ఆమె ముందు నిలవలేక పోయారు. ఈ విజయంతో అందరి దృష్టిని ఆమె ఆకర్షించింది.
కాగా తాజాగా కేరళలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్ కూటమి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది.. విపక్షాలు ఎన్ని ఎత్తులు వేసినా.. మరోసారి కేరళలో సీపీఎం నేతృతంలోని ఎల్‌డీఎఫ్ కూటమి సత్తాచాటింది. ప్రతిపక్షంలోనూ ఉన్న యూడీఎఫ్ కూటమి రెండోస్థానంలో నిలవడగా.. ఎన్డీఏ అంచనాలు వేసిన స్థాయిలో ప్రభావాన్ని చూపలేకపోయింది. ఇక, తిరువనంతపురం.. భారత దేశంలోనే 100 శాతం అక్షరాస్యత నమోదు చేసిన ప్రాంతంగా రికార్డు సృష్టించింది. కాగా తాజాగా మేయర్ అభ్యర్థిగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్న ఆర్య రాజేంద్రన్‌ను మేయర్ అభ్యర్థిగా అధికారిక లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఖరారు చేసింది.