‘టీకా కోసం బారులు తీరకండి.. స్టాక్ లేదు’

by Shamantha N |
‘టీకా కోసం బారులు తీరకండి.. స్టాక్ లేదు’
X

న్యూఢిల్లీ: ప్రజలు టీకా కేంద్రాల ముందు బారులు తీరవద్దని, ప్రభుత్వం దగ్గర టీకా డోసుల నిల్వలు లేవని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. మే 1వ తేదీ నుంచి 18ఏళ్లు పైబడినవారందరూ టీకాకు అర్హులని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘టీకా కేంద్రాల ముందు ప్రజలు లైన్‌లు కట్టవద్దు. ప్రస్తుతం టీకా స్టాక్ లేదు. కంపెనీల నుంచి డోసులు రాగానే ప్రజలందరికీ తెలియజేస్తాం. అప్పుడు టీకా కోసం రండి. అందుకే మరికొన్ని రోజులు టీకా కేంద్రాల ముందు గుమిగూడవద్దని కోరుతున్నాను’ అని కేజ్రీవాల్ అన్నారు. ‘దేశవ్యాప్తంగా చాలా మంది టీకా తీసుకోవడానికి నమోదు చేసుకున్నారు. కానీ, మనకు ఇంకా స్టాక్ రాలేదు. కంపెనీలతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నాం. ఒకట్రెండు రోజుల్లో ఢిల్లీకి టీకా డోసులు వస్తాయి’ అని వివరించారు. ఆదివారంలోపు మూడు లక్షల కొవిషీల్డ్ డోసులు వస్తాయని, భారత్ బయోటెక్, సీరం సంస్థలు రెండూ సుమారు 67 లక్షల డోసులను ఢిల్లీకి సరఫరా చేయనున్నాయని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed