ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్‌గా అరుణ్ మిశ్రా బాధ్యతలు స్వీకరణ

by Shamantha N |   ( Updated:2021-06-02 05:59:01.0  )
ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్‌గా అరుణ్ మిశ్రా బాధ్యతలు స్వీకరణ
X

న్యూఢిల్లీ: జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్ఆర్సీ) చైర్మెన్‌గా జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతేడాది సెప్టెంబర్‌లో ఆయన సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. కాగా 2020 డిసెంబర్‌లో జస్టిస్ హెచ్ఎల్ దత్తు ఎన్ హెచ్ఆర్సీ చైర్మన్ పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. అప్పటి నుంచి ఆ పదవీ ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా మిశ్రాతో పాటు ఎన్‌హెచ్ఆర్సీలోని ఇతర న్యాయమూర్తుల నియామకంపై రాజ్యసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు మల్లిఖార్జున్ ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేస్తు ట్వీట్ చేశారు. ఎన్‌హెచ్ఆర్సీ కమిషన్‌లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నుంచి ఒకరిని నియమించాలని ప్రధాని మోడీకి తాను లేఖ రాసినట్టు ఖర్గే తెలిపారు. అయితే కమిటీ తన ప్రతిపాదనలను అంగీకరించనందున కమిటీ చేసిన ప్రతిపాదనలపై అసంతృప్తి వ్యక్తంచేస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed