చర్మ సమస్యల స్వీయ నిర్ధారణకు గూగుల్ టూల్

by Shyam |
చర్మ సమస్యల స్వీయ నిర్ధారణకు గూగుల్ టూల్
X

దిశ, ఫీచర్స్ : టెక్ దిగ్గజం గూగుల్.. ఏఐ పవర్డ్ టూల్‌ను లాంచ్ చేయబోతోంది. దీని ద్వారా యూజర్లు వందల రకాల చర్మ సమస్యలను సొంతంగా నిర్ధారించుకునే వీలుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పనిచేసే ఈ టూల్ ఉపయోగించి చర్మ, జుట్టు లేదా గోర్ల హెల్త్ కండిషన్‌ను తెలుసుకోవచ్చని ‘ది వర్జ్’ నివేదిక వెల్లడించింది.

ఐ/వో మాన్యువల్ డెవలపర్స్ సమావేశంలో ఈ పరికరాన్ని ప్రదర్శించిన కంపెనీ.. వచ్చే ఏడాది పైలట్ ప్రాజెక్ట్‌గా విడుదల చేయాలనుకుంటున్నట్టు తెలిపింది. ఈ టూల్ ద్వారా యూజర్లు.. శరీరంలో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న(రాషెస్ ఉన్న) చోట ఫోన్ కెమెరాతో మూడు ఫొటోలు తీసి.. తమ చర్మ స్వభావం, ఇతర లక్షణాల గురించి అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు సమస్యను గుర్తించేందుకు వీలుగా ఇదివరకే సెట్ చేయబడిన 288 సారూప్య లక్షణాలతో కూడిన ఓ జాబితాను చూపెడుతుంది.

కాగా యూజర్లు అనేక రకాల చర్మ సమస్యల గురించి గూగుల్‌లో శోధిస్తున్నారని, ఈ మేరకు ఏడాదికి 10 బిలియన్ సంఖ్యలో చర్మ సంబంధ ప్రశ్నలను స్వీకరిస్తున్నామని గూగుల్ హెల్త్‌కు సంబంధించిన చీఫ్ హెల్త్ ఆఫీసర్ కారెన్ డిసల్వ ‘ది వర్జ్’ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రజల చర్మ సమస్య సాధారణమైందా లేదా తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుందా అనే విషయాన్ని ఎక్స్‌‌పర్ట్స్ చెప్పగలరు కానీ, ప్రపంచవ్యాప్తంగా చర్మ వ్యాధి నిపుణుల కొరత ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అంతేకాదు యూజర్లు ఖచ్చితమైన సమాచారం కోసం గంటల తరబడి ఆన్‌లైన్‌లో గడపకుండా ఉండేందుకు ఈ టూల్ ఉపయోగపడుతుందని తెలిపారు. చర్మ సమస్యలపై మిలియన్ సంఖ్యలో, ఆరోగ్యకర చర్మానికి సంబంధించి వేల సంఖ్యలో చిత్రాలతో పాటు క్లినికల్ సెట్టింగ్స్ నుంచి 65 వేల పిక్చర్స్‌ను మోడల్‌గా తీసుకుని తమ టీమ్ ఈ ఫలితాలను పొందుపరిచిందని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story