- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తమిళ్‌లో ‘ఆర్టికల్ 15’
దిశ, వెబ్ డెస్క్: నేషనల్ అవార్డ్ విన్నర్ ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘ఆర్టికల్ 15’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. అనుభవ్ సిన్హా నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. గ్రామీణ ప్రాంతంలో కుల వివక్ష వల్ల జరుగుతున్న అన్యాయాలపై పోరాడే ఓ పోలీస్ ఆఫీసర్.. గ్యాంగ్ రేప్‌కు గురై హత్యచేయబడిన ముగ్గురు అణగారిన వర్గాలకు చెందిన అమ్మాయిల విషయంలో పోరాడి ఎలా విజయం సాధించాడు? ఆర్టికల్ 15 ఎలా ఉపయోగపడింది? అనేది కథ.
Happy to announce remake of Article 15 in Tamil starring @Udhaystalin to be directed by Arunraja Kamraj . It’s a @ZeeStudios_ Studios & @BayViewProjOffl Projects Production. We continue the tradition of remaking strong content this time with @mynameisraahul of Romeo pictures. pic.twitter.com/s1umdVaWYH
— Boney Kapoor (@BoneyKapoor) August 22, 2020
ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని తమిళ్‌లో రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించాడు నిర్మాత బోనీ కపూర్. బే వ్యూ ప్రాజెక్ట్, జీ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని రోమియో పిక్చర్స్ నిర్మాత రాహుల్ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి అరుణ్ రాజ కామరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. ఇంత గొప్ప చిత్రాన్ని తమిళ్‌లో రీమేక్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు నిర్మాత రాహుల్. ‘పింక్’ రీమేక్ నేర్కొండ పార్వయి చిత్రాన్ని కోలీవుడ్‌కు అందించిన బోనీ కపూర్.. ఈ సినిమాను కూడా తమిళ ప్రజలకు అందిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. హిందీ చిత్రాలను తమిళ్‌లో రీమేక్ చేస్తూ కళాకారులను ఆదుకుంటున్నారని అన్నారు. ఇక ఉదయనిధి స్టాలిన్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా.. తను ఈ సినిమా ఒప్పుకోవడమే అదృష్టంగా ఫీల్ అవుతున్నట్లు తెలిపారు నిర్మాత రాహుల్. త్వరలోనే నటీనటుల ఎంపిక పూర్తవుతుందని.. ఆ వెంటనే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.