ఆ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయండి: కాల్వ డిమాండ్

by srinivas |
ఆ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయండి: కాల్వ డిమాండ్
X

శ్రీకాళహస్తిలో ర్యాలీ చేసిన ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డిని అరెస్ట్ చేయాలని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుతోనే శ్రీకాళహస్తిలో కరోనా వైరస్ విజ‌‌ృంభిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాల్వ శ్రీనివాసులు చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్పందించారు. తాను ఎటువంటి ర్యాలీ చేపట్టలేదన్నారు. కాల్వ శ్రీనివాసులు చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రంలో ఉండి ఇక్కడి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు.

Tags: kalva srinivasulu, tdp, mla madhusudanreddy, srikalahasthi



Next Story

Most Viewed