ఈడీ కస్టడీలో రాజకీయనేత కుమారుడు!

by Shamantha N |
ఈడీ కస్టడీలో రాజకీయనేత కుమారుడు!
X

దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్‌ మనీలాండరింగ్ కేసులో సినీ ప్రముఖుల వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతున్న సమయంలో బెంగళూరులో మరో వ్యవహారం కలకలం రేపింది. సీపీఎం కేరళ సెక్రటరీ కొడియేరి బాలకృష్ణన్ కుమారుడు బినీష్ కొరియేరిని పై మనీ లాండరింగ్ అభియోగాల నేపథ్యంలోనే ఈడీ అరెస్ట్ చేసింది. ఇటీవల అరెస్ట్ అయిన డ్రగ్ స్మగ్లర్ మహ్మద్ అనూప్‌ను విచారించగా బినీష్ పేరు చెప్పినట్టు తెలుస్తోంది. అనూప్ సాయంతోనే బినీష్ డ్రగ్స్ అమ్మకాలు, కొనుగోలు చేసినట్టు ఈడీ స్పష్టం చేసింది. దీంతో బినీష్‌ను నవంబర్ 2 వరకు మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.


Next Story