జల్సాలవీరుడు.. జైలుకి.. ఎందుకంటే..?

by Sumithra |
జల్సాలవీరుడు.. జైలుకి.. ఎందుకంటే..?
X

దిశ, పటాన్ చెరు: జల్సాలకు అలవాటు పడి యువతులు, వివాహితలనే టార్గెట్ చేసి శారీరకంగా లోబర్చుకుని డబ్బుల కోసం వేధిస్తోన్న ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ ఘటన అమీన్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్‌పూర్‌లో నివాసం ఉండే ఎండీ అక్రం బిన్ అహ్మద్ అలియాస్ అక్రం ఖాన్(23) పాలిటెక్నిక్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడి ఏ పని చేయకుండా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో అమాయకులైన మహిళల ఫోన్ నంబర్లు సేకరించేవాడు. ఫోన్ చేసి వాళ్లతో పరిచయాలు పెంచుకుని నిత్యం చాటింగ్ చేసేవాడు.

ఈ క్రమంలో వారిని లోబర్చుకుని వీడియో కాల్ మాట్లాడుతూ మహిళల నగ్న చిత్రాలను తీసుకునేవాడు. కొంతమంది మహిళలతో సన్నిహితంగా ఉన్న సమయంలో సెల్ఫీ ఫొటోలు దిగేవాడు. సదరు చిత్రాలను అడ్డుగా పెట్టుకుని కుటుంబ సభ్యులకు పంపిస్తానంటూ వారి నుంచి డబ్బు వసూలు చేసేవాడు. ఈ క్రమంలోనే స్థానికంగా ఓ మహిళతో పరిచయం పెరిగి శారీరకంగా లోబర్చుకున్నాడు. ఆమె నగ్న చిత్రాలు సేకరించి పలుమార్లు బెదిరించాడు. మొత్తంగా ఆమె నుంచి రూ.18 లక్షలకు పైగా వసూలు చేశాడు. దీంతో సదరు మహిళ ఈనెల 23న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అమీన్ పూర్ పోలీసులు అక్రం బిన్ అహ్మద్ అలియాస్ అక్రం ఖాన్‌పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

Advertisement

Next Story

Most Viewed