ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు.. ఆ నిబంధనలు తప్పనిసరి

by Aamani |
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు.. ఆ నిబంధనలు తప్పనిసరి
X

దిశ,అసిఫాబాద్: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అక్టోబర్ 25 నుండి జరుగబోయే ఇంటర్ పరీక్షలకు కోవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేయాలని జిల్లా మాధ్యమిక విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ అన్నారు. గురువారం నాడు జిల్లాలోని కౌటాల, కాగజ్ నగర్, ఆసిఫాబాద్ లోని పలు పరీక్ష కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రభుత్వరంగ మరియు ప్రైవేట్ కళాశాలల్లో మొత్తం 24 కేంద్రాలున్నాయని అన్నింటిలో సానిటైజేషన్, ఫర్నీచర్, సీసీ కెమెరాలు, నీరు, ఇంటర్నెట్, విద్యుత్ తదితర వసతులన్నింటినీ పరిశీలించారు. పరీక్షల సందర్భంగా తప్పనిసరిగా పాటించవలసిన నిబంధనల గూర్చి పలు సూచన చేసారు. జిల్లా వ్యాప్తంగా 4326 మంది జనరల్, 882 ఒకేషనల్ మొత్తం 5208 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాల ప్రకారం కళాశాలల్లో తరగతులను సన్నద్ధం చేసేందుకు చర్యలను తీసుకోవాలని అన్నారు.

Advertisement

Next Story