- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇష్టారాజ్యంగా ఇటుక బట్టీల ఏర్పాటు
దిశ, వేంసూర్: ప్రస్తుత రాకెట్ యుగంలో ప్రతి ఒక్కరు రకరకాల డిజైన్‌లతో చక్కటి గృహ నిర్మాణాలు చేస్తున్నారు. అలాంటి నిర్మాణాలకు ఇటుకలు ప్రధాన భూమిక పోషిస్తాయి. దానిని ఆసరాగా చేసుకుని దొడ్డి దారిలో వేంసూర్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రధాన రహదారికి ఇరువైపులా నివాసాలకు అతి దగ్గరలో అనేక ఇటుక బట్టీలు వెలిశాయి. నిబంధనలకు విరుద్దంగా తమ వ్యాపారాలను మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించు కుంటున్నారు. ఇటుక బట్టి ఏర్పాటు చేయాలంటే పరిశ్రమల శాఖ, మైనింగ్, రెవెన్యూ, కార్మిక శాఖ, విద్యుత్ శాఖ, రవాణా శాఖ, ఫారెస్ట్ తదితర శాఖల నుంచి అనుమతి తీసుకోవాలి. ఇలాంటి అనుమతులు ఏమి ఎక్కడా కనిపించవు.
ఎందుకంటే ఎవరికందాల్సిన ముడుపులు వారికందుతాయి కాబట్టి. స్థానికంగా అందుబాటులో ఉన్న, కలప, నాసిరకం మట్టి, ఇసుక వనరులన్నీ ఎంచక్క దర్జాగా ఉపయోగించుకుంటున్నా అడిగే దిక్కు ఉండదు. పర్మిషన్ ఉందా అంటే వ్యాపారులు ఉంది అంటారు. అధికారులు లేదు అంటారు. ఏది ఏమైనా ఇది ఒక చీకటి వ్యాపారంగా ప్రజలు చెప్పుకుంటున్నారు. కరోనా వైరస్ ఊపిరితిత్తుల మీద పని చేస్తుందని ఊపిరితిత్తులను కాపాడు కోవడానికి కాలుష్యం నుండి దూరంగా ఉండాలని సైంటిస్టులు, డాక్టర్లు నెత్తి నోరు కొట్టుకుంటుంటే ఇవేమి పట్టని వ్యాపారస్తులు జనావాసాల్లో ఇటుక బట్టీలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
అయితే ఇటుక బట్టీలను ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేయడం వలన శీతాకాల పొగమంచుతో పాటు, ఇటుక బట్టీల నుంచి వచ్చే దట్టమైన పొగ వల్ల రహదారులు కనిపించక వాహనదారులకు అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇంత జరుగుతున్నా ఏ అధికారి కూడా కన్నెత్తి చూడక పోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి అక్రమ, అనుమతి లేని ఇటుక బట్టీలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
- Tags
- Brick kiln