5 కోట్ల డౌన్ లోడ్స్ తో "ఆరోగ్యసేతు" యాప్ రికార్డు

by vinod kumar |   ( Updated:2020-04-15 06:38:09.0  )
5 కోట్ల డౌన్ లోడ్స్ తో  ఆరోగ్యసేతు యాప్ రికార్డు
X

దిశ వెబ్ డెస్క్ : కరోనావైరస్ సోకినవారి కదలికలను అబ్జర్వ్ చేసేందుకు, కాంటాక్ట్​ ట్రేసింగ్​ కోసం కేంద్రం ఈ యాప్‌ను ఏప్రిల్​ 2న ప్రారంభించింది. దాంతో లాంచ్​ చేసిన మూడు రోజుల్లోనే 50 లక్షల డౌన్​లోడ్లను ఆరోగ్య సేతు సాధించింది. అది ఓ రికార్డే. ఆ తర్వాత మంగళవారం లాక్​డౌన్​ను పొడిగిస్తున్నట్టు ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీ.. ఆరోగ్య సేతు యాప్​ను అందరూ వాడాలని సూచించారు. ఈ నేపథ్యంలో 24 గంటల్లోనే ఈ యాప్​ను కోటి మందికిపైగా డౌన్​లోడ్​ చేసుకున్నారు. ప్రధాని మోదీతోపాటు వివిధ ప్రభుత్వ విభాగాలు, ఎడ్యుకేషనల్​ బోర్డ్స్ ఈ యాప్​ను ప్రమోట్​ చేస్తుండటంతో యాప్ నకు విపరీతమైన ఆదరణ వచ్చింది. ఈ యాప్​ను లాంచ్​ చేసిన 13 రోజుల్లోనే 5 కోట్లకుపైగా డౌన్ లోడ్స్ ​ను సాధించి రికార్డు సాధించింది.

కరోనా బారి నుంచి కాపాడుకోవడానికి ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ప్రధాని ఇచ్చిన పిలుపు సత్ఫలితాలిస్తోందని నీతి ఆయోగ్ టీమ్ వెల్లడించింది. మోదీ ప్రసంగం తర్వాత నిమిషానికి లక్షమంది చొప్పున రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, సగటున నిమిషానికి 20 వేల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని నీతి ఆయోగ్ బృందంలోని ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ప్రోగ్రామ్ డైరక్టర్ అర్నబ్ కుమార్ తెలిపారు. మొత్తంగా కేవలం 13 రోజుల్లో ఈ యాప్‌‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్ల నుంచి 5 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇంత తక్కువ సమయంలో ఇంతమంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ఓ రికార్డు. 2016లో పోక్‌మాన్ గో గేమింగ్ యాప్‌ను 19 రోజుల్లో 5 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆ తర్వాత అతి తక్కువ సమయంలో ఎక్కువ డౌన్‌లోడ్ అయిన యాప్‌గా ఆరోగ్య సేతు రికార్డు సృష్టించింది.

5 కోట్ల డౌన్ లోడ్ కు :

‘‘టెలిఫోన్​ 5 కోట్ల మందికి చేరడానికి 75 సంవత్సరాలు పట్టింది. రేడియోకు 38 , టీవీకి 13 , ఇంటర్నెట్​కు 4 సంవత్సరాలు పడితే, ఫేస్​బుక్​కు 19 నెలలు, పొకేమన్​ గోకు 19 రోజులు పట్టింది. కానీ కరోనాపై పోరాటం కోసం తీసుకొచ్చిన ‘ఆరోగ్య సేతు యాప్ ’ కేవలం 13 రోజుల్లోనే 5 కోట్ల యూజర్లను సాధించింది. గ్లోబల్​గా ఈ ఫీట్​ సాధించిన ఫాస్టెస్ట్​ ఎవర్​ యాప్​ ఇదే”అని నీతి ఆయోగ్​ సీఈవో అమితాబ్​ కాంత్​ బుధవారం ప్రకటించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ అభివృద్ధి చేసిన ఈ యాప్ ఇంగ్లీష్‌తో పాటు 10 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే.. మన పరిసరాల్లో కరోనా పాజిటివ్‌ వ్యక్తి కదలాడితే వెంటనే మనకు అలర్ట్‌ వస్తుంది. దీంతో మనం వెంటనే అప్రమత్తమై ఇన్ఫెక్షన్‌ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసేందుకు బ్లూటూత్‌, లొకేషన్‌లను ఆన్‌ చేయాల్సి ఉంటుంది.

Tags : corona virus, arogya setu app, record, niti ayog, amitab kanth, pm modi

Advertisement

Next Story