ఆరోగ్యసేతు యాప్@రికార్డు

by Harish |
ఆరోగ్యసేతు యాప్@రికార్డు
X

దిశ వెబ్ డెస్క్: వైరస్‌ వ్యాప్తి కట్టడికి తీసుకోవల్సిన జాగ్రత్తలు, దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య, అప్‌డేట్స్‌ను ప్రజలకు అందించేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ‘ఆరోగ్యసేతు’యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. మూడు రోజుల క్రితం నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ ద్వారా ఈ యాప్‌ వినియోగంలోకి వచ్చింది. అత్యధిక ఇన్ స్టాల్స్ తో .. ఈ యాప్ రికార్డు సృష్టించింది.

కేంద్రం ప్రారంభించిన కోవిడ్-19 ట్రాకింగ్ యాప్ ‘ఆరోగ్య సేతు’కు విశేష స్పందన లభిస్తోంది. ఫోన్‌లోని బ్లూటూత్‌, లొకేషన్ ఆధారంగా కోవిడ్-19 పాజిటివ్ వ్యక్తులను మనం కలిసిందీ లేనిదీ ట్రాక్ చేసి చెబుతుంది. అలాగే, వైరస్‌పై అవగాహన కల్పించడంతోపాటు సలహాలు, సూచనలు అందిస్తుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్ల కోసం గూగుల్ ప్లే స్టోర్, యాప్‌స్టోర్లలో ఉచితంగా అందుబాటులో ఉంది. యాప్‌ను విడుదల చేసిన కొన్ని గంటల్లోనే 10లక్షల మందికిపైగా ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు. దీనికి యూజర్లు 4.6 పాయింట్ల రేటింగ్‌ ఇచ్చారు. ఈ యాప్‌ కరోనా బారిన పడ్డవారెవరైనా మీ సమీపంలోకి వస్తే వెంటనే అప్రమత్తం చేస్తుంది.కరోనా వైరస్‌ దుష్ప్రభావాలను ఎలా గుర్తించాలో అవగాహన కల్పిస్తూనే సెల్ఫ్‌ ఐసోలేషన్‌ ఎలా పాటించాలో సూచిస్తుంది.

5 మిలియన్లు:

గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీనిని 5 మిలియన్ల మంది ఇన్‌స్టాల్ చేసుకున్నట్టు నీతి ఆయోగ్‌లోని ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ప్రోగ్రామ్ డైరెక్టర్ అర్నాబ్ కుమార్ తెలిపారు. యాప్ ప్రారంభమైన మూడు రోజుల్లోనే మొత్తంగా 8 మిలియన్ ఇన్‌స్టాల్స్‌కు చేరువైందని పేర్కొన్నారు. అయితే, ఇన్‌స్టాళ్ల సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. హెల్త్ అండ్ ఫిట్‌నెస్ సెక్షన్‌లో ‘ఆరోగ్య సేతు’ యాప్ టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. ఉచిత యాప్‌ సెక్షన్‌లో ఇదే అగ్రస్థానంలో ఉండటం విశేషం.

Tags: coronavirus, arogya setu app, govt of india, install, record, free app

Advertisement

Next Story

Most Viewed