ఆర్మీ జవాన్ స్థలం కబ్జా!

by Aamani |
ఆర్మీ జవాన్ స్థలం కబ్జా!
X

దిశ, బోథ్: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గ్రామ పంచాయతీ వద్ద ఓ ఆర్మీ కుటుంబం ధర్నా చేపట్టింది. ఆర్మీ జవాన్ అయిన తమ కుటుంబ సభ్యుడికి చెందిన స్థలాన్ని అధికారిక పార్టీకి చెందిన ఓ వ్యక్తి కబ్జా చేసాడని వారు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే.. అక్రమ్ అనే వ్యక్తి తమ కుటుంబ సభ్యులకు కలిసి ఇచ్చోడ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుటు ధర్నా నిర్వహించాడు.

ఆర్మీ జవాన్ అయిన తన తండ్రి ఇచ్చోడ మండలంలోని ఇస్లాంపురాలో 20 సంవత్సరాల క్రితం ప్లాట్ కొనుగోలు చేశారని, ఆ స్థలాన్ని అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి కబ్జా చేసి తమను బెదిరిస్తున్నాడని అతను ఆరోపించాడు. ఈ విషయమై అధికారులను, పోలీసులను ఆశ్రయించినా స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.

Advertisement

Next Story