ఆర్మీ ట్రూపుల తరలింపునకు రెండు ప్రత్యేక ట్రైన్‌లు!

by Shamantha N |
ఆర్మీ ట్రూపుల తరలింపునకు రెండు ప్రత్యేక ట్రైన్‌లు!
X

న్యూఢిల్లీ : లాక్‌డౌన్ అమల్లో ఉండగా.. మిలిటరీ ట్రూపులను తరలించేందుకు రెండు ప్రత్యేక ట్రైన్‌లను భారత ఆర్మీ నడుపనుంది. సెలవులు, ట్రైనింగ్ పూర్తి చేసుకుని లాక్‌డౌన్ కారణంగా సేవలు అవసరమున్న ప్రాంతాలకు కొందరు జవాన్లు వెళ్లలేకపోతున్నారు. అటువంటివారిని నార్తర్న్, ఈస్ట్రన్ కమాండ్‌లకు తరలించేందుకు రెండు ప్రత్యేక రైళ్లను వినియోగించుకోనుంది. ఆర్మీ అవసరాలకు రెండు ట్రైన్‌లు సాంక్షన్ అయ్యాయి. ఇందులో ఒకటి శుక్రవారం.. బెంగళూరు నుంచి జమ్ముకు వెళ్లనుంది. బెల్గాం, సికింద్రాబాద్, అంబాలా గుండా ఈ రైలు ప్రయాణిస్తుంది. కాగా, రెండో ట్రైన్ బెంగళూరు నుంచి గువహతికి శనివారం బయల్దేరుతుంది. ఈ రైలు బెల్గాం, సికింద్రాబాద్, గోపాల్‌పుర్, హౌరాల గుండా వెళ్లుతుంది. డిఫెన్స్ సర్వీసులో ట్రూపులను తరచూ తరలించడాలుంటాయి. ఇందుకోసం ఆర్మీ.. ప్రత్యేక మిలిటరీ ట్రైన్‌ల కోసం భారత రైల్వేను విజ్ఞప్తి చేస్తుంది. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజారవాణా బంద్ కావడంతో వీరి మూవ్‌మెంట్ సవాలుగా మారింది. కాగా, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలసకార్మికుల కోసం ప్రత్యేక రైళ్లను కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు వదంతులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వదంతులను కొట్టిపారేస్తూ అటువంటి ట్రైన్‌లను ఏర్పాటు చేయడం లేదని భారత రైల్వే ప్రకటించడం గమనార్హం. కాగా, వలస కార్మికుల తరలింపు సాధ్యం కాదని కేంద్ర హోం శాఖ అభిప్రాయపడింది.

Tags:army, military, troops, movement, special trains, indian railway, migrant workers


Advertisement
Next Story

Most Viewed