ముంబయి జట్టులోకి అర్జున్ టెండుల్కర్

by Anukaran |
ముంబయి జట్టులోకి అర్జున్ టెండుల్కర్
X

దిశ, స్పోర్ట్స్ : దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కొడుకు అర్జున్ టెండుల్కర్ (21) తొలి సారిగా ముంబయి సీనియర్ జట్టులో చోటు సంపాదించాడు. లెఫ్టార్మ్ పేసర్ అయిన అర్జున్ గతంలో జూనియర్ జట్లు, అండర్ 19 జట్ల తరపున ఆడాడు. ఈ నెలలో ప్రారంభం కానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ కోసం బీసీసీఐ ఆదేశాల మేరకు 20 మంది సభ్యులు గల జట్టును ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ప్రకటించింది. అయితే 22 సభ్యులకు బీసీసీఐ అనుమతించడంతో తాజాగా ఇద్దరి పేర్లను చేర్చారు. దానిలో అర్జున్ టెండుల్కర్ పేరు ఉండటం గమనార్హం. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబయి జట్టు గ్రూప్ ఈ లో ఉంది. జనవరి 11, 13, 15, 17, 19 తేదీల్లో ముంబయి జట్టు వార్మప్ మ్యాచ్‌లు ఆడనున్నది. ఆ తర్వాత అహ్మదాబాద్‌లో నాకౌట్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

ముంబయి జట్టు ఇదే..

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), ఆదిత్య ఠారే (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఆకర్షిత్ గోమెల్, సర్ఫరాజ్ ఖాన్, సిద్దేశ్ లాడ్, శివమ్ దూబే, శుభమ్ రంజానే, సుజిత్ నాయక్, సాయిరాజ్ పాటిల్, తుషార్ దేశ్‌పాండే, ధవళ్ కులకర్ణి, మైనాడ్ మంజ్రేకర్, ప్రథమేష్ ధాకే, అథర్వ అంకొలేకర్, శశాంక్ అత్తార్దే, శామ్స్ ములాని, హార్దిక్ తామోరే, అకాశ్ పర్కార్, సుఫియన్ షేక్, కృతిక్, అర్జున్ టెండుల్కర్.

Advertisement

Next Story

Most Viewed