- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసలు ఎవరీ ఈ నాగ్వాస్‌వాలా?
దిశ, స్పోర్ట్స్: డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్ పర్యటన కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిన జట్టులో పెద్దగా మార్పులు ఏవీ లేవు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆడిన టీమ్ ఇండియా జట్టునే దాదాపు ఖరారు చేశారు. శస్త్ర చికిత్స అనంతరం సరైన ప్రదర్శన చేయని హార్దిక్ పాండ్యా, ఫిట్‌నెస్ లేని పృథ్వీషా, భువనేశ్వర్ కుమార్‌లను పక్కన పెట్టింది. ఇక మిగతా జట్టంతా గత సీజన్‌లో ఆడిన వాళ్లే. అయితే స్టాండ్‌బై ప్లేయర్లుగా నలుగురు ఆటగాళ్లను సెలెక్షన్ కమిటీ లిస్టులో చేర్చింది. అందులో అందరి దృష్టిని ఆకర్షించింది గుజరాత్‌కు చెందిన అర్జాన్ నాగ్వాస్‌వాలా. భారత క్రికెట్ జట్టులో ఒక పార్శీ జాతీయుడు స్థానం సంపాదించడం అరుదైన విషయం. 1975లో ఫారూక్ ఇంజినీర్ టీమ్ ఇండియా తరపున ఆడిన చివరి పార్శీ క్రికెటర్. ఆ తర్వాత భారత జట్టుకు ఎంపికైనది అర్జాన్ నాగ్వాస్‌వాలానే. లెఫ్టార్మ్ మీడియం పేసర్ అయిన అర్జాన్ గత సీజన్ రంజీ ట్రోఫీలో చేసిన అద్భుత ప్రదర్శనే ఈ అవకాశాన్ని తెచ్చిపెట్టింది.
నాగ్వాస్‌వాలానే ఎందుకు?
టీమ్ ఇండియాలో లెఫ్టార్మ్ పేసర్లు చాలా తక్కువగా వస్తుంటారు. జహీర్ ఖార్, ఇర్ఫాన్ పఠాన్, జయదేవ్ ఉనద్కత్, టి. నటరాజన్ వంటి లెఫ్టార్మ్ పేసర్లు ఇండియాకు ప్రాతినిథ్యం వహించారు. ఉనద్కత్ క్రికెట్ నుంచి రిటైర్ అవకపోయినా.. టీమ్ ఇండియాలో స్థానం మాత్రం కోల్పోయాడు. ఇక టి. నటరాజన్ ఆస్ట్రేలియా గడ్డపై అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన కోటాలో 70 శాతం యార్కర్లు వేయగల ఏకైక బౌలర్ ప్రస్తుతం నటరాజనే. అయితే ప్రస్తుతం మోకాలి శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీంతో అతడని ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేయలేదు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమ్ ఇండియా న్యూజీలాండ్‌తో తలపడనున్నది. ఆ జట్టులో ట్రెంట్ బౌల్ట్, మిచెల్ సాంట్నర్ వంటి లెఫ్టార్మ్ పేసర్లు ఉన్నారు. ఇంగ్లాండ్ పిచ్‌లపై ఎడమ చేతి వాటం బౌలర్లు అద్భుతమైన స్వింగ్ రాబడతారు. ఇది కచ్చితంగా భారత బ్యాట్స్‌మెన్‌కు అగ్ని పరీక్ష వంటిది. అందుకే నెట్స్‌లో అద్భుతమైన స్వింగ్ రాబట్టే లెప్టార్మ్ బౌలర్‌తో ప్రాక్టీస్ అవసరం పడనున్నది. నాగ్వాస్‌వాలా జహీర్ ఖాన్ లాగ బంతిని స్వింగ్ చేయగల సత్తా ఉన్న బౌలర్. రంజీ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన దగ్గర నుంచి అతడు తన స్వింగ్‌తో సత్తా చాటుతున్నాడు. కివీస్ బౌలర్లను ఎదుర్కునే ముందు నెట్స్‌లో నాగ్వాస్‌వాలాతో ప్రాక్టీస్ చేయించాలనే అతడిని స్టాండ్ బై బౌలర్‌గా తీసుకున్నది.
రంజీ రికార్డులు..
గుజరాత్ తరపున 2018లో రంజీ ట్రోఫీ అరంగేట్రం చేసిన నాగ్వాస్‌వాలా తొలి మ్యాచ్ రాజస్థాన్‌పై ఆడాడు. ఇప్పటి వరకు 16 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 22.53 సగటుతో 62 వికెట్లు తీశాడు. అలాగే 20 లిస్ట్-ఏ మ్యాచుల్లో 21.76 సగటుతో 39 వికెట్లు, దేశవాళీ టీ20ల్లో 21 పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. 2018-19 రంజీ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడి 21 వికెట్లు తీశాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 90 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్, సిద్దేశ్ లాడ్, ఆదిత్య ఠారే, అర్మన్ జాఫర్ వంటి ఆటగాళ్లను పెవీలియన్ పంపాడు. ఇక 2019-20క సీజన్‌లో మరింతగా సత్తా చాటాడు. కేవలం 8 మ్యాచ్‌లలో 41 వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇక ఈ ఏడాది జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో 7 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు తీశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 9 వికెట్లు పడగొట్టాడు. ఇలా వరుసగా రాణిస్తూ వికెట్లు పడగొడుతున్న నాగ్వాస్‌వాలా టీమ్ ఇండియా లెఫ్టార్మ్ పేసర్ అవసరాలను తీర్చగలడనే నమ్మకం ఏర్పడింది. ప్రస్తుతానికి స్టాండ్ బై బౌలర్‌గానే జట్టుతో వెళుతున్నా.. నటరాజన్‌లాగ అనుకోని అరంగేట్రం చేస్తాడేమో చూడాలి.