- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ హీరో రెండు సార్లు అలా చేశాడు.. కోపంతో 8 గంటల పాటు అరియానా రివేంజ్
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ బ్యూటీ అరియానా హీరో రాజ్ తరణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్‌లో చేసిన రచ్చతో అరియానా కాస్త పాపులర్ అయింది. యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె.. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ అనంతరం హాట్ బ్యూటీగా మారింది. ఓపెన్‌గా చెప్పాలంటే వర్మ, అరియానా తొడలపై చేసిన కామెంట్స్ నెట్టింట్లో చక్కెర్లు కొట్టాయి. ముఖ్యంగా కుర్రకారుకు చమటలు పట్టించాయి. ఈ దెబ్బతో అరియానాకి బిగ్ బాస్ అవకాశం వచ్చింది. ఇక్కడి నుండి అమ్మడు రాత మారిపోయి సినీ అవకాశాలు తన్నుకొచ్చాయి. ఇందులో భాగంగానే రాజ్ తరుణ్ నటించిన ‘అనుభవించు రాజా’ సినిమాలో ఒక పాత్రలో నటించింది.
అయితే రాజ్ తరుణ్‌తో తనకున్న అనుభవాలను అరియానా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. రాజ్ తరుణ్ అంటే తనకు అసలే నచ్చేదే కాదు అని చెప్పింది. కారులో వెళ్తుంటే ఎప్పుడైన యాక్సిడెంట్ అవ్వాలని కోరుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అలాంటిది రాజ్ తరుణ్‌తో సినిమాలో ఎలా నటించానో అర్థం అవ్వట్లేదు అని సందేహం వ్యక్త పరిచింది. అరియానాకి, రాజ్ తరుణ్ పై ఇంత కోపం రావడానికి కారణం ఏమిటని అడిగితే.. ఆమెను ఇంటర్వ్యూకి పిలిచి రెండు సార్లు వెయిట్ చేయించాడు.. అంతేకాకుండా తనకు వేరే పని ఉందని చెప్పి వెళ్లిపోయాడని అసలు విషయం చెప్పింది. ప్రతికారంగా ‘అనుభవించు రాజా’ షూటింగ్ సమయంలో రాజ్ తరుణ్‌ని ఏకంగా 8 గంటలు వెయిట్ చేయించానంటూ అరియానా చెప్పుకొచ్చింది.