20 రౌండ్ల 303 గన్ బ్యాగ్ మిస్సింగ్.. గంటల వ్యవధిలోనే!

by Sumithra |   ( Updated:2021-06-13 11:32:27.0  )
ar-constable 1
X

దిశ, చార్మినార్ : చంచల్ గూడ జైలు ఏఆర్ కానిస్టేబుల్ పోగొట్టుకున్న విలువైన బ్యాగ్‌ను మీర్‌చౌక్ పోలీసులు గంటల వ్యవధిలోనే సురక్షితంగా పట్టుకున్నారు. వివరాల్లోకివెళితే.. చంచల్ గూడకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ రమేష్ ఆదివారం చంచల్ గూడ నుంచి పురాణ పూల్‌కు సైకిల్ పై వెళ్తుండగా మార్గమధ్యలో తన బ్యాగ్‌ను పోగొట్టుకున్నాడు.

20 రౌండ్లతో కూడిన 303 గన్ ఉన్న బ్యాగు కనిపించడం లేదని మీర్‌చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన మీర్‌చౌక్ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా చెత్త బజార్‌లో బ్యాగు పడిపోయినట్లు గుర్తించారు. వెంటనే అక్కడకు పోలీసులు చేరుకుని ఆరా తీయగా, ఇస్మాయిల్ అనే వ్యక్తికి బ్యాగు దొరికినట్లు తేలింది. దీంతో మీర్‌చౌక్ పోలీసులు వెంటనే స్వాధీనం చేసుకున్నారు. 20 రౌండ్లతో కూడిన 303 గన్ బ్యాగులో ఉండటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ కేసును మీర్‌చౌక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story