- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు బంద్
దిశ, వెబ్‌డెస్క్ : విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇటీవల ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో అధికార వైసీపీ పార్టీ 25 కిలోమీటర్ల మేర పాదయాత్రకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వైజాక్ ఉక్కును ప్రైవేటీకరించొద్దని కోరుతూ సీఎం జగన్ సైతం కేంద్రానికి లేఖ రాశారు. అయితే, కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో తాజాగా ఏపీలో రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. దీనికి అధికార పార్టీ సంఘీభావం ప్రకటించింది.
ఈ సందర్భంగా రవాణాశాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. శుక్రవారం ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు బంద్‌లో పాల్గొననున్నాయని, మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత రాకపోకలు సాగుతాయని స్పష్టం చేశారు. కాగా, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రజల ఆస్తిగానే ఉండాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలనే ఆలోచనను కేంద్రం విరమించుకోవాలని పొలిటికల్ పార్టీలు, ప్రజలు కోరుతున్నారు.