బస్ టికెట్ల బుకింగ్ కోసం కొత్త యాప్

by  |
బస్ టికెట్ల బుకింగ్ కోసం కొత్త యాప్
X

దిశ, అమరావతి బ్యూరో: బస్ టికెట్ల బుకింగ్ కోసం ‘ప్రథమ్’ అనే పేరుతో కొత్త యాప్ ను ఏపీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. బస్సు టికెట్ల బుకింగ్ కోసం ఈ కొత్త యాప్‌ను వినియోగించనుంది. తొలుత విశాఖ, విజయవాడ సిటీ బస్సుల పరిధిలో ఈ యాప్‌ ద్వారా టికెట్ల జారీని చేపట్టాలని భావించినా.. ఇప్పుడు పల్లె వెలుగు సహా అన్ని బస్సులకూ వినియోగించాలని నిర్ణయించింది. వచ్చే నెలలో ఇది అందుబాటులోకి రానుంది. దీనికి ‘ప్రథమ్‌’ అనే పేరు పరిశీలనలో ఉంది. ప్రయాణికుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనేది యాప్‌లో నమోదు చేస్తే ఏయే బస్సులు ఏ సమయంలో అందుబాటులో ఉన్నాయనేది యాప్ చూపిస్తుంది. అప్పుడు బస్సును ఎంపిక చేసుకుని టికెట్‌ కొనుగోలు చేయవచ్చు. చెల్లింపులు మాత్రం ఆన్ లైన్ లో జరపాలి. టికెట్‌ జారీ అయినట్లు మెసేజ్‌తోపాటు 4 అంకెల పిన్‌ నెంబరు వస్తుంది. ప్రయాణికుడు బస్‌ ఎక్కే సమయంలో డ్రైవర్‌కు పిన్‌ నెంబరు చెబితే సరిపోతుంది.



Next Story

Most Viewed