నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు ఇన్‌చార్జీల నియామకం

by Sridhar Babu |
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు ఇన్‌చార్జీల నియామకం
X

దిశ,హాలియా : నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ మండలాల వారిగా ఇన్‌చార్జీలను నియమించింది. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న అధిష్ఠానం.. దుబ్బాక ఫలితాన్న రిఫీట్ కాకుండా జాగ్రత్త పడుతోంది. దీనిలో భాగంగా మండలానికి ఓ ఎమ్మెల్యేను ఇన్‌చార్జీగా నియమించింది. గతంలో జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికకు ఇదే వ్యూహాన్ని అమలు చేసిన టీఆర్ఎస్.. ప్రస్తుతం సాగర్ లోనూ ఇదే పంథాను కొనసాగిస్తోంది.

ఇన్‌చార్జీలు వీళ్లే..

తిరుమలగిరి మండలానికి దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, అనుములకు రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్, పెద్దవూరకు చెన్నూరు ఎమ్మెల్యే బాల్కా సుమన్, గుర్రంపోడ్ కు నల్లగొండ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి, నిడమనూరుకు మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, త్రిపురారం మండలానికి మహాబుబాబాద్ ఎమ్మెల్యే బాణోతు శంకర్ నాయక్, హాలియా మున్సిపాలిటీకి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, సాగర్ మునిసిపాలిటీకి కరీంనగర్ మేయర్ సునీల్ రావును నియమించారు. వీరంతా ఆయా మండల, మున్సిపల్ కేంద్రాల్లోని ఉండి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాల్సి ఉంది.

Advertisement

Next Story