జూనియర్ ​కాలేజీలకు కాంట్రాక్ట్​ లెక్చరర్ల నియామకాలు

by Shyam |
teachers
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల నియామకానికి ప్రభుత్వం గ్రీన్​సిగ్నల్ ఇచ్చింది. 2020-21 విద్యా సంవత్సరానికి పనిచేసిన కాంట్రాక్ట్​లెక్చరర్లను 2021-22 విద్యాసంవత్సారానికి కొనసాగించేందుకు ఉన్నత విద్యా మండలికి ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ఈమేరకు ఏడు కేటగిరీలకు చెందిన 4036 మంది ఉద్యోగులను నియమించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రోనాల్డ్​రాస్​ఉత్వర్వులు జారీ చేశారు.

కేటగిరీల వారీగా 3584 మంది కాంట్రాక్ట్​ఫ్యాకల్టీ, 272 మంది పార్ట్​టైం జూనియర్​లెక్చరర్లకు, హవర్లీ బేసిస్​లో పనిచేస్తున్న 55 మందికి, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వేతనం అందుకుంటున్న 47 మంది లెక్చరర్లకు, 78 మంది ఔట్​సోర్సింగ్​ సిబ్బందికి మొత్తంగా 4036 మందికి లబ్ధి చేకూరనుంది. ఆయా జిల్లాల కళాశాలల్లో సబ్జెక్టులవారీగా కాంట్రాక్టు లెక్చరర్లను నియమించాలని పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed