యాపిల్‌ మ్యాప్స్‌లో ‘నియర్ బై’ ఫీచర్

by  |
యాపిల్‌ మ్యాప్స్‌లో ‘నియర్ బై’ ఫీచర్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘నియర్ బై’ పేరుతో ఇండియన్ యూజర్ల కోసం యాపిల్తన మ్యాప్స్‌లో న్యూ ఫీచర్ తీసుకొచ్చింది. దీని ద్వారా గూగుల్ మ్యాప్స్‌ లాగే ఇందులోనూ మనకు సమీపంలో ఉన్న షాపుల వివరాలు, ఆస్పత్రులు, మెడికల్ స్టోర్స్ వంటి సమాచారం తెలుసుకోవచ్చు.

ఇండియాలో కాకుండా ఇప్పటికే ఈ ఫీచర్‌ను 30 దేశాల్లో వాడుతున్నారు. ఇటలీ, న్యూజిలాండ్, సౌదీ అరేబియా, రష్యా, సౌత్ ఆఫ్రికా, స్పెయిన్ ఇలా పెద్ద దేశాల నుంచి మకావ్, మెక్సికో, పోలాండ్, ఐర్లాండ్ వంటి చిన్న దేశాల వరకు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఫీచర్‌తో గ్రాసరీ స్టోర్, రెస్టారెంట్స్, ఫుడ్ డెలివరీ, రైల్వే స్టేషన్, మెడికల్ షాప్స్, హస్సిటల్స్, పిజ్జా షాప్స్, బ్యాంక్స్, ఏటీఎమ్, షాపింగ్ మాల్స్ ఇలా యూజర్‌కు అందుబాటులో ఉన్న అన్ని షాపుల వివరాలను ఈజీగా తెలుసుకోవచ్చు. డైరెక్షన్ కూడా చూపిస్తుంది.


Next Story

Most Viewed