- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాపిల్ హెడ్‌ఫోన్స్ ధర రూ. 79 లక్షలు
దిశ, వెబ్‌డెస్క్ : రష్యన్ కంపెనీ కేవియర్.. ప్రముఖ బ్రాండ్లకు చెందిన గాడ్జెట్స్‌ను లగ్జరీ ఐటమ్స్‌గా రూపొందిస్తుంటుంది. అంతేకాదు బంగారంతో తయారుచేసే ఈ ఐటమ్స్‌లో వజ్రాలను పొదిగి మరీ డిజైన్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా యాపిల్ హెడ్‌ఫోన్స్‌ను బంగారంతో తయారుచేసి అందించేందుకు సిద్ధమైంది.
ఇటీవలే ‘ఎయిర్‌పోడ్స్ మ్యాక్స్’ పేరుతో యాపిల్ తొలిసారిగా హెడ్‌ఫోన్స్‌ను మార్కెట్లోకి విడుదల చేయగా, వాటి ధర రూ. 59 వేలుగా ఉంది. అయితే మీ చేతిలో ప్యూర్ గోల్డ్‌తో తయారైన ఎయిర్ పోడ్స్ మ్యాక్స్ ఉండాలంటే.. రూ. 79, 25, 245/- చెల్లించాలని కేవియర్ కంపెనీ చెబుతోంది. కేవియర్ గ్లోబల్ వెబ్సైట్ ప్రకారం.. ఈ ఎయిర్‌పోడ్స్ గోల్డ్ వైట్, గోల్డ్ బ్లాక్ రంగుల్లో లభించనున్నాయి. ఈ రెండింటినీ కూడా 750 గోల్డ్ (ప్యూర్ గోల్డ్)తో పాటు క్రొకడైల్ లెదర్ ఉపయోగించి రూపొందించగా, వీటిని 2021లో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే వీటిని దక్కించుకోవాలంటే మాత్రం డబ్బులుంటే సరిపోదు, అదృష్టం కూడా కావాలి.
ఎందుకంటే.. కంపెనీ కేవలం రెండు యూనిట్లను మాత్రమే రూపొందిస్తోంది. ఈ రెండు ఫోన్ల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాపిల్ అభిమానులు ఎదురుచూస్తుండగా.. కేవియర్‌లో వీటిని ఎప్పుడు సేల్కు పెడతారో, అప్పుడు ముందుగా బుక్ చేసుకున్న వారికే దక్కుతాయి. ఇక వీటితో పాటు 2021లోనే నైక్ ఎయిర్ జోర్డాన్ షూస్, సోనీ పీఎస్5లను కూడా బంగారంతో రూపొందించి మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కేవియర్ ఇటీవలే ప్రకటించింది.