- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మధ్యాహ్న భోజనానికి కుక్‌లు,హెల్పర్ల నియామకం

X
దిశ, తెలంగాణ బ్యూరో: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం కుక్, హైల్పర్ల నియామకం చేపట్టింది. ఈ ఏడాది ఔట్ సోర్సింగ్ పద్దతిలో 54,201 మందిని భర్తీ చేయనున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది. 10 నెలల సమయానికి గాను నియామకాలను చేపట్టారు. కేంద్ర వాటా ప్రకారం రూ.600ను రాష్ట్రం తరుపున రూ.400 మొత్తం రూ.1000ని కుక్, హెల్పర్లకు ప్రతినెల అందించనున్నారు. 25 మంది విద్యార్థులున్న పాఠశాలకు ఒక కుక్ ను, 26 నుంచి 100 మంది విద్యార్థులున్న పాఠశాలకు కుక్, హెల్పర్లను నియమిస్తున్నారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 2,903 మంది, అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లిలో 784 మందిని భర్తీ చేయనున్నారు.
Next Story