- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒలింపిక్స్ చాలా ప్రమాదం.. జపాన్ వైరాలజిస్ట్ హెచ్చరిక
దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో టోక్యోలో ఒలింపిక్స్ నిర్వహించడం చాలా ప్రమాదకరమని జపాన్‌కు చెందిన వైరాలజిస్ట్, ప్రభుత్వ సలహాదారు హిరోషి ఒషితాని హెచ్చరించారు. కరోనా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడనాకి ఆయన జపాన్ ప్రభుత్వానికి పలు సూచనలు అందించారు. ‘జపాన్ ప్రభుత్వం, టోక్యోఒలింపిక్స్ నిర్వాహక కమిటీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఈ క్రీడలను పూర్తి సురక్షితంగా జరుపుతామని పదే పదే చెబుతున్నాయి. కానీ అసలు ఒక్క కేసు కూడా నమోదు కాకుండా ఆ భారీ ఈవెంట్ నిర్వహించడం అసాధ్యం. ఒక సారి కేసులు నమోదైతే వాటిని ఆపడం కష్టం. అది ఒలింపిక్ విలేజ్‌ను మాత్రమే కాకుండా జపాన్‌ను కూడా వణికించే అవకాశం ఉన్నది’ అని ఆయన అన్నారు.
ప్రపంచంలో చాలా దేశాల్లో కరోనా కేసులు పెద్దగా లేవు. అంతే కాకుండా కొత్త వేరియంట్లు కూడా ఆయా దేశాలలో నమోదు కాలేదు. కానీ ఒలింపిక్స్ నిర్వహించడం వల్ల అలాంటి దేశాలకు కొత్త వేరియంట్ల ముప్పు పొంచి ఉన్నదని ఒషితాని హెచ్చరించారు. కాగా, ఒషితాని ఒక్కప్పుడు ఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్ కావడం గమనార్హం.