రూ.85కోట్ల మెడిసిన్స్ తిన్నారు..

by srinivas |
రూ.85కోట్ల మెడిసిన్స్ తిన్నారు..
X

దిశ,వెబ్‌డెస్క్
ఏపీ ఈఎస్ఐలో భారీ స్కామ్ బయటపడింది. గత టీడీపీ ప్రభుత్వంలోని పలువురు మంత్రుల అండదండలతో మూడు ఫార్మాకంపెనీలు పేద ప్రజలకు అందాల్సిన రూ.85కోట్ల విలువ చేసే మందులను మింగేశాయి.ముఖ్యంగా ల్యాబ్ కిట్లపేరుతో భారీ దోపిడికి పాల్పడ్డాయి. నామినేషన్ పద్ధతి ద్వారా రూ.237కోట్ల విలువ చేసే ల్యాబ్ కిట్లను అప్పటి ప్రభుత్వం ఓమ్నీమెడి,అవెంతార్,లెజెండ్ కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టింది. వీటి ద్వారా ఈఎస్ఐలో దాదాపు రూ.85కోట్ల కుంభకోణం జరిగిందని విజిలెన్స్ అధికారులు చేసిన దాడుల్లో బట్టబయలైంది. దేశంలో ఎక్కడా లేని విధంగా కంపెనీ యాజమాన్యాల ప్రతినిధులు మెడికల్ బోర్డులో కూర్చుని ఈ తతంగం అంతా నడిపడమే విడ్డూరంగా ఉంది.రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు కోనుగోలు చేసిన మెడిసిన్ చేరకుండానే అధికారులు బిల్లులు చెల్లించినట్టు వెల్లడైంది. మందులు ఆస్పత్రులకు సరఫరా అయ్యాక వారిచ్చే బిల్లు కాపీలు లేకుండానే ఈఎస్ఐ డైరక్టర్లు సంతకాలు చేశారని తేలింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరంలేని, మూడు నెలల్లోనే ఎక్స్పైరీ అయ్యే గ్లెన్‌మార్క్ ఆయిల్‌, మందులను కోనుగోలు చేసి స్టోర్లకు సరఫరా చేసినట్టు విజిలెన్స్ విచారణలో బహిర్గతమైంది. ఒక్క ఆయిల్స్ కోనుగోళ్లలోనే రూ.40కోట్లకు పైగా గోల్‌మాల్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. కాగా, విజిలెన్స్ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
Read also..

ప్రైవేటు కాలేజీలకు ‘ఝలక్’

Advertisement

Next Story