- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎటపాకకు పోటెత్తిన తెలంగాణ మద్యప్రియులు
మూడో విడత లాక్‌డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ వ్యాప్తంగా కంటైన్‌మెంట్ జోన్లు మినహా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణలో మాత్రం మద్యం దుకాణాలకు ప్రభుత్వం అనుమతినివ్వలేదు. దీంతో అక్కడ మే 7వ తేదీ వరకు లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగనున్నాయి. దీంతో 8వ తేదీ తరువాత మద్యం దుకాణాలు తెరిచే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఏపీలో మద్యం షాపులు తెరవడంతో మందుబాబుల హడావుడి పెరిగిపోయింది. తూర్పుగోదావరి జిల్లా ఎటపాకలో ఓ మద్యం దుకాణం వద్ద కూడా భారీగా మద్యం ప్రియులు బారులు తీరారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వారిలో అత్యధికులు తెలంగాణ ప్రాంతం వారేకావడం విశేషం. ఎటపాక రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కావడంతో తెలంగాణ వైపు నుంచి కూడా మందుబాబులు ఇక్కడికి వస్తున్నారు.
తెలంగాణకు చెందిన భద్రాచలం నుంచి ఎటపాక అర కిలోమీటరు దూరంలోనే ఉండడంతో ఇక్కడి దుకాణం ముందు కిలోమీటర్ల మేర భారీ క్యూలైన్లు ఏర్పడ్డాయి. మండుటెండను సైతం లెక్కచేయకుండా మందుబాబులు భౌతికదూరం పాటిస్తూ క్యూలో ఓపికగా వేచిచూస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ క్యూలైన్లను చూసేందుకు పలువురు ఔత్సాహికులు ఉత్సాహం చూపిస్తుండడంతో జోన్ల నిబంధనలను పాతరవేస్తున్నారు.
Tags: ap, telangana, yetapaka, border point, liquor shop,